Pronunciation ఉచ్చారణ:
ఇతర భాషల్లో కనిపించనటువంటి ఒక సమస్య మనకు ఇంగ్లీష్ లోనే కనిపిస్తుంది. ఆ సమస్య ఏమిటో, దానిని అర్థం చేసుకునే ప్రయత్నం మనము ఈ వీడియోలో చేద్దాము.
ఈ సమస్య ఏంటంటే ఇంగ్లీష్ లో ఒక పదాన్ని చూసినప్పుడు దాన్ని ఎలా ఉచ్చరించాలో చాలా సందర్భాలలో మనకు తెలియదు.
నిజానికి ఇంగ్లీష్ అనేది ఒక Phonetic భాష కాదు.
ఏది రాస్తామో దానినే గనుక పలికితే అది Phonetic భాష అవుతుంది. మనకు తెలిసిన భారతీయ భాషలన్నీ కూడా అంటే తెలుగు గాని, హిందీ గాని, మరాఠీ గాని ఇవన్నీ కూడా Phonetic భాషలు.
తెలుగులో ఒక ఉదాహరణ చూసినట్టయితే “కుర్చీ” అనే పదాన్ని కనుక తీసుకుంటే రాసేటపుడు “కుర్చీ” అని రాస్తాము, పలకడం కూడా “కుర్చీ” అని పలుకుతాము.
ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఇంగ్లీష్ అనేది Phonetic భాష కాదు. అంటే రాయడం ఒకలా ఉంటుంది, పలకడం మరోలా ఉంటుంది.
ఇంగ్లీష్ లో CHAIR అనే పదాన్ని గనుక తీసుకుంటే, పలికేటప్పుడు చైర్ అని పలుకుతున్నాము, రాసేటప్పుడు మాత్రం C H A I R అని రాస్తున్నాము. అంటే పలకడానికి రాయడానికి ఏమాత్రం సంబంధం లేదన్నమాట.
ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మరొక ఉదాహరణ చూద్దాం. G H అనే రెండు అక్షరాలు, ఒక్కొక్క పదంలో ఒక్కొక్క రకమైన ఉచ్చారణను కలిగి ఉంటాయి.
ఉదాహరణ ద్వారా దీనిని చూసే ప్రయత్నం చేద్దాము.
ముందుగా….. THOUGH…అనే పదం.
దీంట్లో మనకు G H అనే రెండు అక్షరాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు అక్షరాల వల్ల ఉత్పన్నమవుతున్న టువంటి Sound………ఓ.
మరొక పదం గనుక తీసుకున్నట్లయితే
THROUGH……
ఇక్కడ కూడా మనకు G H అనే రెండు అక్షరాలు కనిపిస్తున్నాయి. రెండు అక్షరాల వల్ల ఉత్పన్నమవుతున్న శబ్దము………ఊ.
మరొక పదం తీసుకుంటే COUGH… అంటే దగ్గు. ఇక్కడ G H వల్ల వచ్చే సౌండు……..ఫ.
మరొక పదం తీసుకున్నట్టయితే NIGHT నైట్. ఇందులో GH అనేది almost Silent గా ఉంది.
అంటే ఇక్కడ ఏం జరుగుతుంది?
అవే అక్షరాలు GH అనే రెండు అక్షరాలు… ఒక్కొక్క పదంలో ఒక్కొక్క రకమైన సౌండ్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. దీని వల్ల మనకు కొత్త పదం ఎదురైనప్పుడు దానిని ఏ విధంగా పలకాలో మనకు ఏ మాత్రం కూడా అర్థం కాదు, అందువల్ల గందరగోళ పడాల్సి వస్తుంది.
మొత్తంమీద ఇంగ్లీష్ లో ఒకే రకమైన అక్షరాలు వేర్వేరు పదాలలో వేరు వేరు Sounds ని ఉత్పత్తి చేస్తాయి అని మనకు అర్థమవుతుంది.
దీనివల్ల మనకు ఎదురయ్యే సమస్య ఏంటి మరి?
Spoken English from Telugu నేర్చుకునేప్పుడు ప్రతి పదం యొక్క ఉచ్చారణ గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. తెలుగులో అయితే పదాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఉచ్చారణ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఇంగ్లీష్ లో అయితే పదం యొక్క అర్థం తెలుసుకోవడంతో పాటు, దాని స్పెల్లింగ్ కూడా గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది.
ఇది అదనంగా వచ్చేటటువంటి ఒక ఇబ్బంది.
ఇంకొక సమస్య… మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, ఒక కొత్త పదం ఎదురైనప్పుడు దానిని ఎలా పలకాలో అర్థంకాదు, తప్పనిసరిగా డిక్షనరీలో లేదా ఏదైనా App లో చూడాల్సి వస్తుంది. ఇంగ్లీష్ అనేది Phonetic భాష కాదు అని మనం తెలుసుకున్నాం.
మరి ఒక Word యొక్క pronunciation ఎలా తెలుసుకోవాలి?
దీనికి మూడు ముఖ్యమైన techniques ఉన్నాయి. ముందుగా ఒక ఈజీ టెక్నిక్ చూద్దాము.
1. ఇప్పుడంతా Online ప్రపంచం అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్ ఉంది, కాబట్టి గూగుల్ లోకి వెళ్లి ఒక Word ఎంటర్ చేసి దాని పక్కన ‘pronunciation’ అని గనుక టైపు చేస్తే మీకు దాని యొక్క ఉచ్చారణ తెలిసిపోతుంది. దీనికోసం ఎక్కువమంది ఉపయోగించేటటువంటి వెబ్సైటు Howjsay.com. ఈ వెబ్ సైట్ లో మీరు ఒక పదాన్ని ఎంటర్ చేసి చూస్తే దాన్ని pronunciation మీకు వినబడుతుంది. ఈ పద్ధతిలో మీరు తప్పనిసరిగా Internet కి కనెక్ట్ అయి ఉండాలి.
2. ఇక రెండవది Offline పద్ధతి. అంటే Internet కి కనెక్ట్ అయి లేకపోయినా కూడా మీరు ఒక పదం యొక్క pronunciation తెలుసుకునే పద్ధతి.
మీ మొబైల్లో Play Store నుండి ColorDict అనే ఒక App ని డౌన్లోడ్ చేసుకోండి. Download చేసుకున్న తర్వాత ఒక డాటాబేస్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు ఒక పదాన్ని టైప్ చేస్తే గనుక ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా మీకు ఆ పదం యొక్క pronunciation వినిపిస్తుంది.
3. ఇక మూడవది Conventional పద్ధతి, అంటే సంప్రదాయపద్ధతి. అదేంటంటే డిక్షనరీని refer చేయడము. మామూలు డిక్షనరీ కాకుండా, మంచి Advanced డిక్షనరీలో ప్రతి పదం పక్కన 2 ఏటవాలు lines ఇవ్వబడతాయి.
ఆ రెండు ఏటవాలు లైన్స్ మధ్యలో మనకు phonetic transcription symbols కనిపిస్తాయి. మీరు గనక ఈ సింబల్స్ ని నేర్చుకోగలిగితే, డిక్షనరీ చూసి ఒక పదం యొక్క pronunciation ఎలా ఉంటుందో చెప్పవచ్చు.
Most useful Courses to Improve your English Skills…Grab them today…
మీ English Skills మెరుగు పరుచుకోవడానికి ఎంతో ఉపయోగకరమైన కోర్సులు… ఈరోజే App install చేసుకోండి.



