Phrases to use in Emergency Situations-02
Spoken English in Telugu
The building is on fire.
ఆ భవనానికి నిప్పంటుకుంది.
I think I am having a heart attack.
నాకు గుండెనొప్పి అని అనుమానంగా ఉంది.
My house been broken into.
మా ఇంట్లోకి ఎవరో ప్రవేశించారు.
I am lost.
నేను దారి తప్పాను.
We are lost.
మేము దారి తప్పాము.
I don’t know where I am.
నేనేక్కడున్నానో నాకే తెలియడం లేదు.
Calm down.
శాంతించండి, అరవకండి.
Take it easy.
ఊరుకోండి, తేలికగా తీసుకోండి.
Don’t worry
కంగారు పడకండి, బాధ పడకండి.
Go away.
వెళ్ళిపో, ఇక్కడినుండి.
Please call the doctor.
దయచేసి డాక్టరుని పిలవండి.
I am feeling fine.
నేను బాగానే ఉన్నాను.
It’s going to be fine.
అంతా సర్దుకుంటుంది.
It’s nothing serious.
అంత సీరియసేమీ కాదు.
I need a doctor.
నాకొక డాక్టరు కావాలి.
There’s been an accident.
అక్కడ ఒక ఆక్సిడెంట్ జరిగింది.
Where is the fire escape?
తప్పించుకునే దారి ఎటువైపు ఉంది?
My head hurts.
నా తలకు దెబ్బ తగిలినట్టుగా ఉంది, ….నొప్పిగా ఉంది.
She is not breathing.
ఆమె ఊపిరి తీసుకోవడం లేదు.
Do you need help?
మీకు సహాయం కావాలా?
I am in danger.
నేను ప్రమాదంలో ఉన్నాను.
Where does it hurt?
ఎక్కడ దెబ్బ తగిలింది?
I have cut my finger.
నా వేలు తెగింది.
I can’t see.
నాకేమీ కనబడటం లేదు.
I have a nose bleed.
నా ముక్కులోంచి రక్తం వస్తోంది.
I am choking.
నాకు శ్వాస ఆడటం లేదు.
I am hurt.
నాకు దెబ్బ తగిలింది, నేను గాయపడ్డాను.