5 Tips to Master Spoken English in Telugu.

5 Tips to Master Spoken English
5 Tips to Master Spoken English

ఇంగ్లీషులో మాట్లాడాలన్న కోరిక కలగానే ఉండిపోతోందా? (#Spoken English in Telugu )

ఇంగ్లీషులో సరిగ్గా మాట్లాడలేకపోతున్ననన్న సందేహంతో ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారా?

అయితే మీకోసమే ఈ చిట్కాలు.

 

ఏదైనా ఓ ఔషధం పని చేయాలంటే ముందుగా కావలిసింది నమ్మకం. ఆ మందు సరిగ్గా పనిచేస్తుందన్న నమ్మకం. ఇదే – – – – –

1. ప్లాసేబో ఎఫెక్ట్ (Placebo Effect).

మీ ఫ్రెండ్ ఒకడిని పాము కరిచింది. అది మామూలు పామేనని, విషం లేనిదని మీకు తెలుసు.

ఆ సమయంలో ప్రాణభయంతో గజగజ వణుకుతున్నవాడికి “నూటికి 90 శాతం పాములు విషం లేనివి, నిన్ను కరిచింది కూడా అలాంటి పామే”నని ఎంత నచ్చజెప్పినా వాడి తలకెక్కదు. అదే, ఏదో ఒక ఇంజక్షన్ ని విషానికి విరుగుడు అని చెప్పి ఇచ్చామనుకోండి, చప్పున లేచి కూర్చుంటాడు. ఇక్కడ పని చేసింది నమ్మకమే. ఆ ఇంజక్షన్ ఇవ్వలేదనుకోండి ..ఏమవుతుందో మీరు ఊహించుకోవచ్చు.

మనం రోజూ ఎన్నో బ్లాగుల్లో, వార్తా పత్రికల్లో, institute లలో ఇంగ్లీషు నేర్చుకోవడానికి ఎన్నో పద్దతులు, టెక్నిక్స్ చూస్తూ ఉంటాం. వాటిని చూసినట్లే చూసి పక్కన పారేస్తాం, అంతేతప్ప అమలు పరచడం అంటూ జరగదు. ఎందుకంటే మనకి వాటివల్ల ఇంగ్లీషు నేర్చుకోవచ్చన్న నమ్మకం ఏమాత్రం లేదు.

ఎప్పడైతే మనం ఇది తప్పకుండా జరుగుతుంది అని గట్టిగా విశ్వసిస్తామో అప్పుడే మరింత బలంగా ప్రయత్నిస్తాము. ఇది జరగదు అని అనుకున్నప్పుడు ‘ఎంత త్వరగా వొదిలేస్తే అంత మంచిది’ అని మనస్సు, శరీరం, బుద్ధి ఇవన్నీ కూడా అనుకోవడం మొదలుపెడతాయి. అందుకే ఆ పని సడలిపోయి మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. అందుకనే ఇంగ్లీషు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా కలిగి ఉండాల్సింది నమ్మకం, ‘నేను నేర్చుకొని తీరతాను’ అన్న సంకల్పం.

  1. ఇంగ్లీషు వాతావరణంలోకి ప్రవేశించండి:

మీచుట్టూ ఎటు చూసినా ఇంగ్లీషు మాత్రమే ఉండేలా, అది తప్ప ఇతర ఏ భాషలూ లేకుండా జాగ్రత్త పడండి.

  • ఇంగ్లీషు మాట్లాడే స్నేహితులు
  • ఇంగ్లీషు newspaper
  • ఇంగ్లీషు టీవీ చానల్స్
  • ఇంగ్లీషు సినిమాలు
  • ఇంగ్లీషు పుస్తకాలు
  • ఇంగ్లీషు YouTube వీడియోలు

3. ఒక పద్దతి ప్రకారం నేర్చుకోండి.

అలాగే, ఏం నేర్చుకుంటున్నారో రోజూ నోట్ చేసుకోండి.

ఇంగ్లీషు నేర్చుకోవడానికి ఇతరుల సహాయం తీసుకోవడం మంచిది. ఇతరులు అంటే trainers కావొచ్చు, స్నేహితులు కావొచ్చు, institute కావొచ్చు, పుస్తకం కావొచ్చు లేక video కోర్సు అయినా కావొచ్చు.

ఇలా నోట్ చేసుకుంటూ ఉంటె ఏరోజు ఏం నేర్చుకుంటున్నారో ఒక అవగాహన ఉంటుంది. లేకపోతె ఒకే టాపిక్ పై అనేక రోజులు అనవసరంగా వృధా చేసే ప్రమాదముంది.

ఉదాహరణకు

Day 1   సలహా ఇవ్వడం

Day 2   క్షమాపణ చెప్పడం

Day 3   (orders) ఆదేశాలు ఇవ్వడం

ఇలా నేర్చుకోవచ్చు.

4. Practice

మనలో చాలామంది ఇంగ్లీషులో బాగా రాయగలుగుతారు.

మరికొందరు ఇంగ్లీషులో బాగా ఆలోచించగలుగుతారు కూడా.

కానీ ఎప్పుడైతే ఇతరులతో నిజ జీవితంలో మాట్లాడాల్సి వస్తుందో అప్పుడు మాత్రం తడబడటం, పదాల కోసం తడుముకోవడం, ఇంగ్లీషుని ఆపేసి తెలుగులోకి వెళ్ళిపోవడం చేస్తారు.

“ఛీ….అనవసరంగా ఇంగ్లీషులో మాట్లాడాము…మాట్లాడకున్నా బాగుండేది “ అని సిగ్గుగా ఫీల్ అవుతారు కూడా.

చక్కగా రాయగలిగినవారు, ఆలోచించగలిగినవారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?

దానికి కారణం ప్రాక్టీసు లేకపోవడమే.

కేవలం పుస్తకాలు చదివి నేర్చుకొని ఇంగ్లీషులో మాట్లాడటం సాధ్యం కాదు. దీనికి ప్రాక్టీసు చేయడం కూడా అవసరం. ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే మీ నాలుక, నోరు కూడా ఇంగ్లిషుకి అలవాటు పడాల్సి ఉంటుంది.

కాబట్టి వీలయినంత ప్రాక్టీసు చేయాలి.

ప్రాక్టీసు ఎలా చేయాలి?

గ్రూపుతో :

ఇంగ్లీషులో మాట్లాడటానికి మీకు స్నేహితులు గనక ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులే. మీ పని మరింత సులువవుతుంది. మీరు చేయాల్సిందల్లా ఏదో ఒక టాపిక్ గురించి (అదెంత పనికిమాలిందైనా సరే) వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఇది ఇంగ్లీషులో Spoken skills పెంపొందించుకోవడానికి ఒక సులువైన దారి.

ఒంటరిగా:

చాలా సందర్భాల్లో మీకు మాట్లాడటానికి తోడు దొరక్కపోవచ్చు. ప్రోత్సహించడం అటుంచి ఎగతాళి చేస్తూ వెనక్కి లాగేసేవాళ్ళు కోకొల్లలుగా మీచుట్టూ ఉండి ఉండవచ్చు. అలాంటి సందర్భంలో మీరు ఒంటరిగానే ప్రాక్టీసు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఒక నిలువుటద్దం ముందు నిల్చొని ఒక్కో డైలాగుని గట్టిగా చెప్పాల్సి ఉంటుంది. ఇది కూడా మంచి టేక్నికే.

ఒక్కరే మాట్లాడుకోవాల్సి రావడం వల్ల కొంత ఇబ్బందిగా అనిపించినా- – – –  తప్పదు మరి.

5. గ్రామరుని పక్కనపెట్టండి: (Spoken English in Telugu ).

ఇంగ్లీషులో మాట్లాడాలంటే తప్పనిసరిగా గ్రామరు నేర్చుకోవాలన్న అపోహ చాలామందిలో ఉంది. నిజానికి తప్పులు లేకుండా రాయడానికి, భాషను ఒక క్రమ పద్దతిలో నేర్చుకోడానికి గ్రామరు సహాయం చేస్తుందే తప్ప కేవలం spoken English నేర్చుకోవడానికి గ్రామరు compulsory ఏమీ కాదు.

మరి ఎక్కడి నుండి మొదలు పెట్టాలి?

ముందుగా phrases, sentences తో మొదలుపెట్టండి.

రోజూ మీకు నచ్చిన సంఖ్యలో కొన్ని sentences తీసుకొని వాటిని ప్రాక్టీసు చేయండి. నెమ్మదిగా ఈ sentences కి అలవాటు పడితే ఎక్కువసేపు కూడా ఇంగ్లీషులో మాట్లాడగలుగుతారు.

ఇలా ప్రతీరోజూ క్రమం తప్పకుండా Spoken English నేర్చుకోడాన్ని ఒక సరదాగా మార్చడానికి English Infinite ప్రవేశపెడుతున్నది “Spoken English Course”. (#Spoken English in Telugu ).


Most useful Courses to Improve your English Skills…Grab them today…

మీ English Skills మెరుగు పరుచుకోవడానికి ఎంతో ఉపయోగకరమైన కోర్సులు… ఈరోజే App install చేసుకోండి. 

How to Speak in Meetings
How to Speak in Meetings
Spoken English Course in Telugu
Spoken English Course in Telugu
Email Letter writing
Email Letter writing

Install English Infinite App

Google Play Store
Google Play Store

 

Leave a comment

Your email address will not be published.